
యాప్రాల్: పేద ప్రజలపై అధిక బారం మోపుతు పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి ముదిరాజ్. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అల్వాల్ మండల సీపీఐ పార్టీ ఆద్వర్యంలో యాప్రాల్ విద్యుత్ కార్యాలయం ముందు నాయకులు, కార్యకర్తలు, అధిక బిల్లులతో బాధ పడుతున్న బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణమూర్తి.. లాక్ డౌన్ తో లక్షలాది మంది పేద ప్రజలు తినడానికి తిండి లేక .. చేసుకోవడానికి పని లేక తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు నాకేం వాస్తే కంటితుడుపు చర్యలు చేపట్టిందని అవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ వినియోగ దారులు గత నెలల కింద వాడిన కరెంట్ బిల్లులకు ఈ లాక్ డౌన్ లో 3 నెలలకు వాడిన, కరెంట్ బిల్లులకు చాలా వ్యత్యాసం పెరిగిందన్నారు. వందల రూపాయలలో ఉన్న కరెంట్ బిల్లులు.. వేల రూపాయలకు ఎట్లా పెరుగుతాయని ఈ పెంచినా కరెంటు బిల్లులు పేద ప్రజలు ఎలా చెల్లిస్తారన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన అధిక కరెంటు బిల్లును వెంటనే తగ్గించి, పేద ప్రజలకు న్యాయం చేయాలని రొయ్యల కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే CPI అల్వాల్ మండల పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ..కరెంట్ బిల్లులు తగ్గించేవరకు విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.