సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలి

సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలి

హైదరాబాద్/శంషాబాద్,వెలుగు: సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దీన్ని సీపీఐ ప్రతిపాదిస్తుందనీ, ఇదే విషయాన్ని విజయవాడలో జరిగే జాతీయ మహాసభల్లో ముసాయిదా తీర్మానంలోనూ పేర్కొన్నట్టు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలో భాగంగా సోమవారం  ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఇందులో డి.రాజా మాట్లాడుతూ.. గతంలో చెప్పిన పునరేకీకరణకు, నేడు ప్రతిపాదిస్తున్న ఏకీకరణకు తేడా స్వల్పమేనన్నారు. సీపీఎం జనతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుందని, సీపీఐ జాతీయ ప్రజాస్వామ్యం గురించి చెబుతోందన్నారు. పార్టీల ఏకీకరణపై సీపీఐ ప్రతిపాదనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.