సీపీఐ 9 రోజుల పాదయాత్ర ప్రారంభం

సీపీఐ 9 రోజుల పాదయాత్ర ప్రారంభం

బషీర్‌బాగ్, వెలుగు: ప్రధాని మోదీ ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొడుతూ.. దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు 9 రోజుల పాదయాత్ర కార్యక్రమాన్ని గురువారం బషీర్ బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్​విగ్రహం వద్ద ప్రారంభించారు.

అనంతరం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ  తదితరులు పాల్గొన్నారు.