దేశ ప్రజలను బీజేపీ, రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ దగా చేశాయి : నారాయణ

దేశ ప్రజలను బీజేపీ, రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ దగా చేశాయి : నారాయణ

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీపడుతూ అన్ని రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేశాయన్నారు సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ. యువతకు భ్రమలు కల్పించి ఏమీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను బీజేపీ, రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ దగా చేశాయని ఆరోపించారు. ఒకప్పుడు దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు.. ఇప్పుడు బీసీని సీఎం చేస్తామని బీజేపీ చెబుతోందంటూ సెటైర్ వేశారు. బీసీని సీఎం చేస్తానని చెబుతున్న బీజేపీ.. ఉన్న బీసీ అధ్యక్షుడిని తొలగించారని మండిపడ్డారు. 

ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించారో అప్పుడే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని బయటపడిందన్నారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నానా గడ్డి కరుస్తోందన్నారు. BJP, MIM ఒక్కటి కాకపోతే గోషామహల్ లో MIM ఎందుకు పోటీలో లేదని ప్రశ్నించారు. జలగం వెంగళరావు వారసుడు వెంకట్రావ్ కి బీ ఫామ్ కొనుక్కునే దుస్థితి పట్టిందని అన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు ఖతం అవుతాయని అన్నారు.