హిల్ట్ పాలసీకి సీపీఐ మద్దతు : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హిల్ట్ పాలసీకి సీపీఐ మద్దతు : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హిల్ట్‌‌‌‌‌‌‌‌  పాలసీకి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. అయితే, ఈ విధానం అమలులో స్పష్టత ఉండాలని, ప్రభుత్వ భూములను అమ్మకూడదని ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్​పాలసీ 2047 డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌పై జరిగిన చర్చలో  మాట్లాడారు. 

కాలుష్యం వల్ల ఢిల్లీ, హైదరాబా ద్ ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని కూనంనేని తెలిపారు. కాలుష్యం వల్లే సీనియర్ నేత సురవరం  సుధాకర్ రెడ్డి అనారోగ్యం పాలై మనకు దూరమయ్యారని చెప్పారు.