సోనమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ దీక్షకు సీపీఎం సంఘీభావం

సోనమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ దీక్షకు సీపీఎం సంఘీభావం
  • 20న సీజేపీ తలపెట్టిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముట్టడికి మద్దతు

న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన పార్లమెంట్ ముట్టడికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి 16వ రోజుకు చేరింది.

ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో ఉన్న వాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ అమర రామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు తదితరులు పరామర్శించి, సంఘీభావాన్ని ప్రకటించారు. అలాగే, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో ప్రత్యేకంగా సమావేశమై.. ఉద్యమ పరిస్థితులను, భవిష్యత్ కార్యాచరణను చర్చించారు.

అనంతరం జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత వహించి రాజీనామా కూడా చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ విషయంలో సీజేపీ చేస్తున్న ఆందోళనలకు సీపీఎం పూర్తిగా అండగా ఉంటుందని, తెలంగాణలోనూ  కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.