కాంగ్రెస్ తో పొత్తు లేకుంటే ..26 స్థానాల్లో పోటీకి సీపీఎం రెడీ..

కాంగ్రెస్ తో పొత్తు లేకుంటే ..26 స్థానాల్లో పోటీకి సీపీఎం రెడీ..

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ తో పొత్తు లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా 26 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సీపీఎం రాష్ట్ర కమిటీలో పలువురు నేతలు ప్రకటించారు. ఒకవేళ సీపీఐతో కలిసి పోటీ చేస్తే కొన్ని స్థానాల్లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ లో వివిధ జిల్లాల కమిటీల నుంచి ప్రపోజల్స్ సేకరించారు. మొత్తంగా 26 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కనీసం16 స్థానాల్లోనైనా పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. దీంట్లో ఐదు స్థానాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి, నేతలంతా పని చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

మధ్యాహ్నం వరకు కాంగ్రెస్​కు టైం: తమ్మినేని
సీపీఎంకు ఇస్తామన్న రెండు సీట్లపై ఇయ్యాల మధ్యాహ్నం వరకు కాంగ్రెస్​ పార్టీ స్పష్టత ఇవ్వాలని, లేదంటే 3 గంటలకు ప్రెస్​ మీట్​ పెట్టి తమ లిస్ట్​ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  కాంగ్రెస్​ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు.