సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

నస్పూర్, వెలుగు: సీపీఎస్ విధనం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల కార్పొరేషన పరిధి నస్పూర్‌‌‌‌‌‌‌‌లోని ఎంఎం గార్డెన్స్‌‌‌‌లో పీఆర్టీయూటీఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, బచ్చమోహన్‌‌‌‌రావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, వంగ మహేందర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌‌‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టు సీపీఆర్‌‌‌‌‌‌‌‌ రద్దు చేయడంతోపాటు పీఆర్సీని చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. పీఆర్టీయూటీఎస్‌‌‌‌ టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో పలు సంఘాల నుంచి టీచర్లు పీఆర్టీయూలో చేరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండ జనార్ధన్, మహిళ అధ్యక్షురాలు జనగామ ఉమాదేవి  పాల్గొన్నారు.