ప్రారంభించిన 12 రోజులకే ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై పగుళ్లు.. యూపీలో లక్నో- కాన్పూర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై ఘటన 

ప్రారంభించిన 12 రోజులకే ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై పగుళ్లు.. యూపీలో లక్నో- కాన్పూర్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై ఘటన 

ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభించిన ఓ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై 12 రోజులకే పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రారంభమై రెండు వారాలు కూడా గడవకముందే వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతినడంతో దాని నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 4,200 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో– కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేను ఈ నె 13న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించారు. 

అయితే, ఈ నెల 25 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ఉన్నావ్ సమీపంలో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే రోడ్డు పెద్ద ఎత్తున కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రారంభమైన 12 రోజుల్లోనే ఈ దృశ్యాలు విస్మయానికి గురిచేశాయి. కాగా, కోరారి గ్రామం దగ్గర రోడ్డు ఐదు నుంచి ఏడు మీటర్ల మేర కుంగిపోయిందని పేర్కొంటూ సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ నేత మధుసూదన్ యాదవ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘నేను లక్నో – -కాన్పూర్ ఎలివేటెడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేపై ప్రయాణిస్తుండగా కోరారి చేరుకున్నాను. వర్షం తర్వాత రోడ్డు ఎలా పగిలిపోయిందో చూశాను’ అని ఆయన ఆ వీడియోలో వివరిస్తూ రోడ్డుపై ఏర్పడిన పగుళ్లను చూపించారు. ఇలాంటి పగుళ్లు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మధుసూదన్ యాదవ్.. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

కోటింగ్ మాత్రమే దెబ్బతింది

ఎక్స్​ప్రెస్‌‌‌‌వేపై పగుళ్లు ఏర్పడ్డాయన్న ఆరోపణలను ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ నకుల్ ప్రకాష్​ వర్మ ఖండించారు. కొరారి ప్రాంతంలో సుమారు 40 కి.మీ. మేర పైభాగంలోని కోటింగ్ మాత్రమే దెబ్బతిందని, తారు రోడ్లలో ఇలాంటి సమస్యలు సాధారణమేనని చెప్పారు. సమాచారం అందిన వెంటనే మరమ్మతులు చేపట్టి, వేగంగా పూర్తిచేశామని చెప్పారు.