
మొహాలి : నాలుగో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, ధావన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ మంచి రన్ రేట్ తో భారత్ కు అదిరే శుభారంభం అందించారు. ఓపెనర్ల జోరు చూస్తుంటే భారత్ భారీ స్కోర్ దిశగా కనిపిస్తోంది. 22 ఓవర్లు ముగిసేసమయానికి ఇండియా స్కోర్ వికెట్ నష్టపోకుండా 130. ధావన్(78), రోహిత్(50) క్రీజులోఉన్నారు.
ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. భారత్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.