
హైదరాబాద్, వెలుగు: కమిటీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటర్స్ ఆదేశానుసారం నల్లగొండ జిల్లా బాలుర ఓపెన్ సెలెక్షన్స్‌ను ఈనెల 16న నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ప్రారంభమయ్యే సెలెక్షన్స్‌కు ఔత్సాహికులైన ప్లేయర్లు హాజరవ్వచ్చని తెలిపింది. వెరిఫికేషన్ ప్రక్రియ గురించి బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులాంటి ఒరిజినల్ గుర్తింపుకార్డులను ప్లేయర్లు తీసుకురావాలని సూచించింది