క్రైమ్ క్యాపిటల్‌‌గా బిహార్... రాష్ట్ర సర్కార్‌‌‌‌పై రాహుల్ గాంధీ ఫైర్

క్రైమ్ క్యాపిటల్‌‌గా బిహార్... రాష్ట్ర సర్కార్‌‌‌‌పై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌లోని ఎన్డీయే సర్కార్‌‌‌‌పై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్‌‌‌‌ను దేశానికి నేర రాజధానిగా మార్చిందని ఫైర్ అయ్యారు. బిజినెస్‌‌మెన్ గోపాల్ ఖేమ్కా హత్యపై స్పందిస్తూ ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్‌‌’లో రాహుల్ పోస్టు పెట్టారు. ‘‘నేడు బిహార్ దోపిడీ, కాల్పులు, హత్యల నీడలో నివసిస్తున్నది. ఇక్కడ నేరాలు సర్వసాధారణంగా మారిపోయాయి. క్రైమ్‌‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని ఆయన మండిపడ్డారు. 

భద్రత కల్పించని సర్కార్‌‌‌‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘కొత్త బిహార్‌‌‌‌ను నిర్మించుకోవడానికి సమయం వచ్చింది. ఈసారి మీరు వేసే ఓటు కేవలం ప్రభుత్వాన్ని మార్చడానికే కాదు.. బిహార్‌‌‌‌ను కాపాడడానికి ఉపయోగపడుతుంది” అని అన్నారు. కాగా, మగధ్ హాస్పిటల్ ఓనర్ గోపాల్ ఖేమ్కాను శుక్రవారం రాత్రి 11:40 గంటలకు పాట్నాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.