స్టూడెంట్ల వివరాలు లీక్ చేస్తే క్రిమినల్ కేసులు! ‘వెలుగు’ కథనంతో కదిలిన విద్యాశాఖ..

స్టూడెంట్ల వివరాలు లీక్  చేస్తే క్రిమినల్ కేసులు! ‘వెలుగు’ కథనంతో కదిలిన విద్యాశాఖ..
  • ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరిక
  • డేటా అమ్మకానికి పెడితే ప్రిన్సిపాళ్లు, మేనేజ్మెంట్లకు జైలు శిక్ష తప్పదు
  • ‘వెలుగు’ కథనంతో కదిలిన విద్యాశాఖ.. అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్​జేడీలకు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీల్లో చదివే స్టూడెంట్ల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు, ఏజెన్సీలకు చేరవేస్తే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ నెల 19న 'వెలుగు' దినపత్రికలో ప్రచురితమైన ‘స్టూడెంట్స్ డేటా అమ్ముకున్నారు’ కథనంపై సర్కారు స్పందించింది. దీనికి అనుగుణంగా 'వెలుగు'లో వచ్చిన కథనాన్ని జోడిస్తూ మంగళవారం ఆయన అన్ని జిల్లాల డీఈఓలు, ఆర్​జేడీలకు ఉత్తర్వులు జారీచేశారు. 

అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేట్ కాలేజీలు స్టూడెంట్స్ ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన డేటాను మార్కెటింగ్ ఏజెన్సీలకు అమ్ముకుంటున్నాయి. దీంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రోజుకు పదుల సంఖ్యలో కాల్స్, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వస్తుండటంతో విసిగిపోతున్నారు. ఈ అంశాన్ని 'వెలుగు' కథనంలో బయటపెట్టడంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సీరియస్ అయ్యారు. విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు అత్యంత గోప్యంగా ఉంచాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా డేటా లీక్ అయినట్లు తేలితే.. సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలనే బాధ్యులను చేస్తూ వేటు వేస్తామని హెచ్చరించారు.

  •  కేవలం అఫీషియల్ పనులకే..

విద్యార్థుల సమాచారం అత్యంత సెన్సిటివ్, కాన్ఫిడెన్షియల్ అని, కేవలం అధికారిక విద్యా సంబంధిత అవసరాలకు తప్ప మరే ఇతర పనులకు వాడకూడదని డైరెక్టర్ నవీన్ నికోలస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అన్-అథరైజ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డేటాను షేర్ చేసినా, తప్పుడు పద్ధతుల్లో వాడినా వారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి స్కూల్ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ తమ వద్ద ఉన్న స్టూడెంట్స్ డేటా బయటకు వెళ్లకుండా పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.