వన్డే టీమ్ లో కుల్దీప్, దీపక్ ఎంపికపై విమర్శలు

వన్డే టీమ్ లో కుల్దీప్, దీపక్ ఎంపికపై విమర్శలు

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముఖ్యంగా వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియాకు, సెలెక్టర్లకు ఓ పాఠం. హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అయినా 2023 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, కరీబియన్లతో వన్డే, టీ20ల కోసం ప్రకటించిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి చాలా మంది మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. చెత్తాటతో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి తీసుకోవడంతో పాటు దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుడాకు వన్డేల్లో చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సడన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యంగ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి బిష్నోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీ20 వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పిలవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డొమెస్టిక్​ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోకున్నా  కూడా ఇద్దరికీ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొంతకాలంగా లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిస్టరీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిని  సెలెక్టర్లు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుకున్నారు. కానీ, వాళ్లను పట్టించుకోకుండా ఇప్పుడు బిష్నోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు చూశారు.

కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరు నెలలుగా ఆడలే..  

టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ రిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలనే కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి తీసుకున్నట్టు తెలుస్తోంది. చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడుగా కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారనొచ్చు. గతంలో ఈ కుల్చా (కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జోడీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్నో విజయాలు అందించింది. కానీ, లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాకు నాలుగు వన్డేలే ఆడిన కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేవలం రెండే వికెట్లు తీశాడు. కనీసం రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కంట్రోల్​ చేయలేదు. పైగా,2021 జులై నుంచి కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా కేవలం పేరు చూసే కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారా?  లేదంటే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ తప్పుకోవడంతో ఎవరైనా చెబితేనే అవకాశం ఇచ్చారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేద్దామనే ఉద్దేశంతో యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవి బిష్నోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికను సమర్థించొచ్చు. కానీ, దీనివల్ల  రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిస్టరీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లారిటీ లేకుండా పోయింది. 2021 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఈ ఇద్దరికీ మంచి ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందని అంతా భావించారు. అయితే, సౌతాఫ్రికా టూర్​కు పట్టించుకోని సెలెక్టర్లు ఇప్పుడు కూడా  వాళ్లను కాదని  కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిష్నోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

టీ20లకు గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దా? 

యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీ20లకు కాదని కేవలం వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయడం కూడా సరైన నిర్ణయం కాదనిపిస్తోంది. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తను టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. పైగా, సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ  తనకు ఒక్క చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాలేదు. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో సైతం నాలుగు భారీ సెంచరీలతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్లకు వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీలైనన్ని ఎక్కువ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తే  కచ్చితంగా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతారు. 

దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు?  

ఏ రకంగా చూసినా వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుడా ఎంపిక సరైనదే అనిపించడం లేదు. ఎందుకంటే లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తను 16.00 యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేవలం 160 రన్సే చేశాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు వికెట్లతో  సరిపెట్టాడు. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారే వన్డే ట్రోఫీలోనూ హుడా  గొప్పగా ఆడలేదు. కర్నాటకపై సెంచరీ చేయడమే తన బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది కూడా లేదు. అలాంటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డేల్లో ఏం చేయిస్తరో అర్థం కాని ప్రశ్న.  ఇక, మొన్నటిదాకా శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీగా లేరన్న సెలెక్టర్లు సౌతాఫ్రికా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాళ్ల ఆట చూశాక యూ టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన్డేల్లో  ఇప్పుడు ఈ ఇద్దరూ సీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా ఉన్నారు. కానీ, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషి ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ సత్తా చాటిన రిషి కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ టోర్నీలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజేతగా నిలిపినా చాన్స్​ రాకపోవడం అతని బ్యాడ్​లక్​