V6 News

CRPF Jobs: సీఆర్పీఎఫ్ భారీ నోటిఫికేషన్.. 1.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్

CRPF Jobs: సీఆర్పీఎఫ్ భారీ నోటిఫికేషన్.. 1.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సీఆర్పీఎఫ్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1.30లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కేంద్రం రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,29,929 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది. వీటిలో 1,25,262 పోస్టులు పురుషులకు.. 4,467 పోస్టులు మహిళలకు కేటాయించగా.. కానిస్టేబుల్ పోస్టుల్లో రిక్రూట్‌మెంట్ కోసం10 శాతం ఖాళీలు ఎక్స్-అగ్నివీర్లకు కేటాయించడం గమనార్హం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ పోస్టులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అధికారులు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపిక అనంతరం ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి వేతనాల విషయానికొస్తే.. రూ. 21,700- 69,100 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక సీఆర్‌పీఎఫ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

https://twitter.com/ANI/status/1643808681832902656