సుక్మా జిల్లాలో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది

సుక్మా జిల్లాలో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది

ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పటాసులు పేల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుంటూ దివాళిని సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో పాటు సంగీత వాయిద్యాలు వాయిస్తూ & పాటలు పాడుతూ జవాన్లు సరదాగా గడిపారు. 74వ బెటాలియన్ కు చెంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో ఉంటూనే దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నారు. సామూహికంగా అమ్మవారిని ఆరాధించి సంబరాలు చేసుకున్నారు.

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా,పెద్దా కలిసి వేడుకలో పాల్గొంటున్నారు. వెలుగుల పండుగ వేళ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.