సైకో తల్లి: మీదెక్కి తొక్కుతూ.. కాలితో తన్నుతూ.. ఇంత ఘోరమా..

సైకో తల్లి: మీదెక్కి తొక్కుతూ.. కాలితో తన్నుతూ.. ఇంత ఘోరమా..

ఈ భూ ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఏంటంటే అది తల్లి ప్రేమ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పచ్చు. అంత మహాబలుడైనా అమ్మ ఒడిలో పసివాడే అని ఓ సినీ కవి అన్నట్టు, మనం ఎంత ఎదిగినా అమ్మ మాత్రం మనల్ని పసిపిల్లల్లాగే భావిస్తుంది. మనం ఎంత అల్లరి చేసినా సహిస్తుంది భరిస్తుంది తల్లి.అలాంటి తల్లి తన పిల్లలపై క్రూరంగా వ్యవహరిస్తుందని కలలో కూడా ఉహించం. ఒకవేళ అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసులో తల్లి గనక పిల్లల్ని ఘోరంగా హింసిస్తే,... ఆ పిల్లలకు అంతకంటే నరకం ఉంటుందా.

హర్యానాలోని ఫైరదాబాద్ కి చెందిన ఒక పిల్లాడికి అంత నరకం చూపిస్తోంది ఒక కసాయి తల్లి.భర్త ఇంట్లో లేని సమయంలో 11ఏళ్ళ పిల్లాడిని కొడుతూ, మీదెక్కి తొక్కుతూ, కాలితో తన్నుతూ దారుణంగా హింసించింది తల్లి.ఈ మేరకు ఆమె భర్త షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.