గువాహటి: లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోనీ కండరాల గాయం మరవకముందే... చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్డ్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ నడుం నొప్పితో మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. ‘రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్రెవిస్ ఆడటం లేదు.
ప్రాక్టీస్‌లో అతనికి గాయమైంది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో గాయం తీవ్రతను అంచనా వేస్తాం. దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ధోనీ జట్టుతోనే కొనసాగుతాడు. కాకపోతే బరిలోకి దిగడు. మహీ గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ జట్టుపై అతని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. త్వరలోనే ధోనీ జట్టులోకి వస్తాడు’ అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
