ప్లే ఆఫ్ : ఇవాళ చెన్నై, ముంబై తొలి క్వాలిఫయర్

ప్లే ఆఫ్ : ఇవాళ చెన్నై, ముంబై తొలి క్వాలిఫయర్

పన్నెండో సీజన్‌ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్‌ ,చెన్నై సూపర్‌ కింగ్స్‌ . రెండూ రెండే. ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన జట్లే. చెరోమూడుసార్లు టైటిల్​ అందుకున్నవే. ఈ సారి కూడా అద్భుతంగా ఆడి దర్జాగా ప్లేఆఫ్స్‌ కు దూసుకొచ్చాయి. ఇప్పుడు ఫైనల్‌ బెర్త్‌ కోసం చెన్నైలో నేడు తొలి క్వాలిఫయర్‌ లో ఢీకొంటున్నాయి. మరి, నాలుగో ట్రోఫీ వేటలో ఉన్న ఈ రెండు జట్లలో నేరుగా ఫైనల్‌ కుచేరుకునేది ఎవరో..? టేబుల్‌ టాపర్‌ రోహిత్‌ సేనా? చెన్నైలో తిరుగులేని ధోనీ గ్యాంగా?

 

దాదాపు నెలన్నరగా క్రికెట్‌ అభిమానులకు ధనాధన్‌ విందును పంచిపెడుతున్న ఐపీఎల్‌ 12వ సీజన్‌ తుది దశకు చేరిపోయింది. ఇక్కడి చెపాక్‌ స్టేడియంలోమంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకునేందుకు రెడీఅయ్యాయి. ఈ మ్యాచ్‌ లో నెగ్గి నేరుగా ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇందులో ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌ –2 రూపంలో మరో చాన్స్‌ ఉంటుంది. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లూ అంత దూరం వెళ్లకుండా ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కాలని కోరుకుంటున్నాయి . సొంతగడ్డపై ఈ మ్యాచ్‌ ఆడడం చెన్నైకి చాలా కలిసొచ్చే అంశం. పైగా చెపాక్‌ లో ఈసీజన్‌ లో ఆడిన ఏడు మ్యాచ్‌ ల్లో ఆరింటిలో విజయం సాధించింది.

డుప్లెసిస్‌ , వాట్సన్‌ , డుప్లెసిస్‌ , సురేశ్‌రైనాతో సీఎస్‌ కే టాపార్డర్‌ జోరుమీదుంది. అన్నింటికంటే మించి కెప్టెన్‌ ధోనీ అద్భుత ఫామ్‌ లో ఉన్నాడు.12 మ్యాచ్‌ ల్లో 368 రన్స్‌ చేసిన ధోనీ చెన్నై టీమ్‌ లోటాప్‌ స్కోరర్‌ . టాపార్డర్‌ తడబడిన ప్రతిసారి అతను జట్టును ముందుండి నడిపించాడు. అంబటి రాయుడు ఒక్కడిపైనే చెన్నై అందోళనంతా. ధోనీసేన బౌలర్లు కూడా ఈసారి అద్భుతంగా రాణిస్తున్నారు. 21 వికెట్లు తీసిన తాహిర్‌ టాప్‌ –2లో ఉండగా, వెటరన్‌ హర్భజన్‌ , జడేజా కీలక సమయాల్లో వికెట్లుతీస్తున్నారు. పేసర్‌ దీపక్‌ చహర్‌ కూడా రాణిస్తున్నాడు. . గాయం కారణంగా కేదార్‌ జాదవ్‌ జట్టుకు దూరమైనప్పటికీ, ఈ సీజన్‌ లో అతను పెద్దగా రాణించిందిలేదు. కాబట్టి కేదార్‌ గైర్హా జరు చెన్నైకు సమస్య కాదు. జాదవ్‌ స్థానాన్ని మురళీ విజయ్‌ లేదా ధ్రువ్‌ షోరేతోభర్తీ చేసే అవకాశముంది.

రోహిత్
సేనకు ఎదురుందా..
ముంబై కూడా అన్ని విభాగాల్లో బలంగా ఉంది.టేబుల్‌ టాపర్‌ గా నిలవడం.. లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌ లో కోల్‌ కతాను చిత్తు చేసిన ముంబై దూకుడును చూస్తే చెన్నైకి విజయం అంత ఈజీ కాదనిపిస్తుంది. బ్యాటింగ్‌‌‌‌లోక్వింటన్‌ డికాక్‌ (492 రన్స్‌ ) చెలరేగుతున్నా డు. కెప్టెన్‌రోహిత్‌ శర్మ(386 రన్స్‌ ), సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకట్టుకుంటున్నారు. ఆల్‌ రౌండర్‌  హార్దిక్‌ ముంబై జట్టు తురుపు ముక్కగా మారాడు. ఈడెన్‌ గార్డెన్ స్‌ లో కోల్‌ కతాపై అతని ఇన్నింగ్స్‌ చూస్తే ముంబైని ఓడించడం ఎంతకష్టమో తెలుస్తుంది.  పైగా లీగ్‌‌‌‌దశలో చెన్నైతో జరిగిన రెండు మ్యాచ్‌ ల్లోనూ ముంబై విజేతగానిలిచింది. దీంతో ముంబై పైచేయి  సాధించినట్టు కనిపిస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యానికి పోయినా భారీ మూల్యం తప్పదు. సొంత అభిమానుల మద్దతు మధ్య చెన్నై బ్యాట్స్‌ మెన్‌ ను అడ్డుకోవడం బుమ్రా, మలింగతో కూడిన ముంబై బౌలింగ్‌‌‌‌ దళానికి పరీక్షే.