సింగపూర్ ఓపెన్ విన్నర్ పంకజ్

సింగపూర్ ఓపెన్ విన్నర్ పంకజ్

న్యూఢిల్లీ: ఇండియా టాప్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ  సింగపూర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ స్నూకర్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1తో లోకల్ ఫేవరెట్‌‌‌‌ జేడెన్‌‌‌‌ అంగ్‌‌‌‌పై ఘన విజయం సాధించాడు. ‌‌‌‌తుదిపోరులో తొలి రెండు ఫ్రేమ్స్‌‌‌‌ను ఈజీగా నెగ్గిన ఇండియా స్టార్ 2–0తో ఆధిక్యంలోకి వచ్చాడు. 

హోరాహోరీగా సాగిన మూడో ఫ్రేమ్‌‌‌‌లో గెలిచిన జేడెన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో నిలిచాడు. కానీ, అతనికి మరో చాన్స్‌‌‌‌ ఇవ్వని పంకజ్‌‌‌‌ నాలుగో ఫ్రేమ్‌‌‌‌లో పైచేయి సాధించి టైటిల్ ఖాయం చేసుకున్నాడు. చివరి ఫ్రేమ్‌‌‌‌ను 76–4 తేడాతో నెగ్గి ట్రోఫీ గెలుచుకున్నాడు.