సనత్ నగర్ లో మహిళా పైలట్ కు వేధింపులు.. ఒక రాత్రి తనతో గడపాలంటూ జిమ్ ట్రైనర్ ఒత్తిడి 

సనత్ నగర్ లో మహిళా పైలట్ కు వేధింపులు.. ఒక రాత్రి తనతో గడపాలంటూ జిమ్ ట్రైనర్ ఒత్తిడి 

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో మహిళా పైలట్ ను వేధించాడు జిమ్ ఓనర్. ఒక రాత్రి తనతో గడపాలంటూ ఒత్తిడి చేయడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. శనివారం ( జూన్ 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సనత్ నగర్ లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్ లో ఫిట్నెస్ మేనేజర్ గా పని చేస్తున్నాడు సంతోష్ గౌడ్. జిమ్ కు ట్రైనింగ్ కోసం వచ్చిన ఓ మహిళా పైలట్ ను వేధించాడు సంతోష్.

జిమ్ ట్రైనింగ్ పేరుతో ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు సంతోష్. ఒక రాత్రి తనతో గడపాలంటూ బాధితురాలిపై ఒత్తిడి పెట్టాడు నిందితుడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే సంతోష్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇందుకు సహకరించింది. ఒకేసారి ఇద్దరితో ప్రైవేట్ గా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అంటూ బాధితురాలిని వేధించింది.
 
బాధితురాలు ఒప్పుకోకకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకర మెసేజ్ లు పెట్టి వేధించాడు సంతోష్. సంతోష్ వేధింపులతో విసిగిపోయిన మహిళా పైలట్ పోలీసులను ఆశ్రయించింది. ఈ  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.