చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీకి కమిన్స్‌‌‌‌ దూరం!

చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీకి కమిన్స్‌‌‌‌ దూరం!

సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌.. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్న కమిన్స్‌‌‌‌.. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో శ్రీలంకతో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు దూరంగా ఉన్నాడు. దీంతో బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ తర్వాత కమిన్స్‌‌‌‌ మళ్లీ ఇంత వరకు ప్రాక్టీసే మొదలుపెట్టలేదు. ఫలితంగా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ వరకు అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను సాధించడం సందేహంగా మారింది. 

‘కమిన్స్‌‌‌‌ ఇప్పటివరకు బౌలింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ మొదలుపెట్టలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను మ్యాచ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధిస్తాడో లేదో తెలియదు. కాబట్టి అతన్ని చాంపియన్స్‌‌‌‌కు పంపడం కష్టమే’ అని హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ మెక్‌‌‌‌ డొనాల్డ్‌‌‌‌ వెల్లడించాడు. ఒకవేళ కమిన్స్‌‌‌‌ గైర్హాజరైతే స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌, ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌లో ఒకరికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలున్నాయి. శ్రీలంకతో తొలి టెస్ట్‌‌‌‌లో స్మిత్‌‌‌‌ జట్టును అద్భుతంగా నడిపించాడు. కాబట్టి అతనికే ఎక్కువ చాన్స్‌‌‌‌ ఉంది.