V6 News

కెప్టెన్ ఈజ్ బ్యాక్: యాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో టెస్ట్‌‎కు కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కెప్టెన్ ఈజ్ బ్యాక్: యాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో టెస్ట్‌‎కు కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే యాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ మేరకు 15 మంది జట్టులో సెలెక్టర్లు అతనికి చోటు కల్పించారు. జులైలో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్ను నొప్పికి గురయ్యాడు. అప్పట్నించి అతను రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. నొప్పి నుంచి కోలుకున్నా ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో యాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఆడలేదు. అయితే  ఇప్పుడు పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండటంతో మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

 స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను బరిలోకి దిగనున్నాడు. అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖవాజా ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు తాను ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధిస్తానని ఖవాజా నమ్మకంతో ఉన్నాడు. పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిస్థితులను బట్టి తుది జట్టును ప్రకటించనున్నారు. ఈ నెల 17 నుంచి అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది.