న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో (అక్టోబర్–డిసెంబర్)లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) 13.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.20 లక్షల కోట్ల)కు చేరింది. ఇది ఆ క్వార్టర్‌లో నమోదైన జీడీపీలో 1.3 శాతానికి సమానం. 2024 డిసెంబర్ క్వార్టర్‌లో 11.3 బిలియన్ డాలర్లుగా నమోదవగా, అప్పటి జీడీపీలో 1.1 శాతంగా సీఏడీ ఉంది.
ఎగుమతుల కంటే దిగుమతులు విలువ ఎక్కువ ఉండటం వల్ల ఏర్పడే తేడాను కరెంటు ఖాతా లోటు ( సీఏడీ) అంటారు. ఇదిలా ఉంటే, డిసెంబర్ క్వార్టర్‌లో సరుకు వాణిజ్య లోటు 93.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. 111.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని కేంద్రం తెలిపింది.
