
హైదరాబాద్ లో ఎక్కడైనా సరే పెట్రోల్ పోయించుకునేటప్పుడు వాహనాల ఓనర్లు జాగ్రత్తగా చూడండి .లేకపోతే మొదటికే మోసం వస్తుంది. మీ వాహనాలు పాడైపోతాయి. అవును.. శేరిగూడలో ఇలానే ఓ వ్యక్తి సెప్టెంబర్ 11న రాత్రి తన కారులో పెట్రోల్ పోయించుకుని ఇంటికి వెళ్లాడు. తీరా మరుసటి రోజు తెల్లవారుజామన ఆఫీస్ కు వెళ్దామని కారు తీయగా అది స్టార్ట్ కాలేదు. కారును మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తే పెట్రోల్ ట్యాంకులో నీళ్లు చేరాయని..ఇంజిన్ పాడైపోయిందని చెప్పాడు. దీంతో కారు యాజమాని ఒక్కసారిగా షాకయ్యాడు.
అసలేం జరిగిందంటే.? రంగారెడ్డి జిల్లా శేరిగూడలో హెచ్ పీ పెట్రోల్ పంపులో మహేశ్ అనే వ్యక్తి సెప్టెంబర్ 11న రాత్రి తన బ్రీజా కారులో పెట్రోల్ పోయించుకున్నారు. ఈ రోజు ఉదయం కారు స్టార్ట్ కాకపోవటంతో మెకానిక్ దగ్గరకు కారును తీసుకెళ్లగా పెట్రోల్ ట్యాంక్ లో నీళ్లు చేరటంతో ఇంజిన్ చెడిపోయిందని చెప్పాడు.దీంతో కారు యజమాని మహేశ్ శేరిగూడ పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా క్రింద నీళ్లు పైన పెట్రోల్ ఉన్నట్లు కనిపిస్తున్న బాటిల్ ను చూపెట్టాడు. గతంలో కూడా ఈ పెట్రోల్ పంపుపై ఇలానే ఆరోపణలు వచ్చాయని పలువురు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పలువురు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని కూడా చెబుతున్నారు.
►ALSO READ | 10 నెలల తర్వాత మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార ధరలు..
పెట్రోల్ పంపుపై పోలసులు తనిఖీలు చేసి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్షలు పెట్టి కొన్న తమ వాహనాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.