ఫ్లైట్లో అరుదైన జీవజాతుల రవాణా

ఫ్లైట్లో అరుదైన జీవజాతుల రవాణా

తమిళనాడులోని చెన్నైలో అరుదైన జీవజాతులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి అరుదైన జీవులను పట్టుకుని ..స్మగ్లర్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. 

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఫ్లైట్లో  ఓ ప్రయాణికుడు రెండు బ్యాగులతో దిగాడు. అయితే కస్టమ్స్‌ అధికారులు అతని బ్యాగులను  తనిఖీ చేశారు.   రెండు బ్యాగులలో అరుదైన జీవులు కనిపించాయి. వాటిలో 45 బాల్‌ పైథాన్‌లు, 3  కుచ్చుతోక కోతులు, 3 నక్షత్ర తాబేళ్లు, 8  కార్న్‌ స్నేక్స్‌ ఉన్నట్లు గుర్తించారు. వాటిని సీజ్‌ చేసి తిరిగి బ్యాంకాక్‌కు పంపించారు. అలాగే స్మగ్లర్ పై వన్యప్రాణి చట్టం కింద కేసులు నమోదు చేశారు.