కేంద్రంతో పోరాడి.. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను రీ ఓపెన్ చేశాం: వివేక్ వెంకటస్వామి

కేంద్రంతో పోరాడి.. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను రీ ఓపెన్ చేశాం: వివేక్ వెంకటస్వామి

ఎరువుల కొరతపై  కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రామగుండం ఆర్ ఎఫ్ సిఎల్ ప్లాంట్ ను రీ ఓపెన్ చేశామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ వైశ్య భవన్ లో  సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో రైతుల కిసాన్ మేళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా .. రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారని అందుకే  జనాలకు  వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తున్నాయని చెప్పారు. ఆర్గానికి ఫార్మింగ్ వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించి సూచనలు ఇవ్వాలన్నారు. ప్రపంచ దేశాల్లో కంటే ఎక్కువ రసాయన ఎరువులు కొనుగోలు చేస్తుందన్నారు.

ప్రజలందరికీ కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.  ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్గానిక్ వ్యవసాయ రైతులకు ప్రభుత్వం నుంచి లోన్స్, అమ్ముకోవడానికి మార్కెట్, పంట పండించడానికి స్థలాలు సహకారం అందిస్తే ఆర్గానిక్ వ్యవసాయం పెరుగుతుందన్నారు.  పాలు షాటేజ్ ఉండటాన్ని గుర్తించి మంచిర్యాల జిల్లాలో పాడి పరిశ్రమను పెంపొందిస్తున్నామన్నారు.  ఎల్లంపల్లి ప్రాజెక్టు మా జిల్లాలో ఉండటంతో చాపలకు డిమాండ్ పెరిగిందన్నారు. మత్స్య కార్మికులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలన్నారు. పద్మశాలిలకు టెక్ట్స్ టైల్  పార్క్ ఇస్తే వాళ్లకు ఉపాధి దొరుకుతుందని.. వీటన్నింటినీ సీఎం మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి పాటుపడతానని అన్నారు ప్రేమ్ సాగర్ రావు.