ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు

 ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి హక్కు కలిగిన రైతును కదాని మరో వ్యక్తికి భూమి హక్కు కల్పించడం సమంజసం కాదన్నారు. రైతుల సమస్యలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో మంచిర్యాల సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో రైతుల కిసాన్ మేళ నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించి రైతులు ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయం,తమ లక్ష్యమని  చెప్పారు. సేంద్రియ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించామని తెలిపారు.

 సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో 250 ఎకరాల్లో 125 మంది రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయ పంటల సాగు చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ విధానం వల్ల హాని చేసే పురుగులు నశించి మనకు మేలు చేసే పురుగులు వృద్ధి చెంది అధిక దిగుబడులు వస్తుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ రంగాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్కుగా రూపొందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.