
సుడీగాలి సుధీర్ (Sudigali Sudheer) బుల్లితెరపై అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షోల్ కమోడియన్ గా.. టీవీ షోల్లో యాంకర్గా ..అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్నా చితక మెజిషియన్ చేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఇమేజ్ పెంచుకున్నాడు. పలు షోలతో బిజీగా గడుపుతునే..వీలైనప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రముఖ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న సర్కార్ షో కి..సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే లేటెస్ట్గా సర్కార్ సీజన్ 4కి సంబంధించిన మూడో ఎపిసోడ్ నుంచి ప్రోమో రిలీజైంది. వచ్చే నెల మే 3న రిలీజ్ కానున్న ఈ మూడో ఎపిసోడ్‌లో నలుగురు టాలీవుడ్ లేటెస్ట్ హీరోయిన్లు షోలో సందడి చేయబోతున్నారు. మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల, శ్రీ గౌరిప్రియ, బబుల్ గమ్ బ్యూటీ మానస చౌదరి, శివాని గెస్ట్‌లుగా వచ్చారు.
తాజా ప్రోమోలో సుధీర్ ఈ బ్యూటీస్ తో చేసిన రచ్చ అంత ఇంత కాదు. వారి పేర్లు అడుగుతూనే..పంచ్ డైలాగ్స్ తో పాటు తనదైన శైలిలో కవితాత్మకమైన పంచులు కూడా విసురుతున్నాడు. అందులో భాగంగా శ్రీగౌరిప్రియ రాగానే మీరు మిస్ హైదరాబాద్ కదా..అని ఆమెను సుధీర్ అడిగడం..వెంటనే అవునని ఆమె అనగానే..నేను ఎలా మిస్ అయ్యాను అని అనడం ఆకట్టుకుంటుంది.
ఇక ఆ తర్వాత అనన్య నాగళ్ల రాగానే ఆమెకు లవ్ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి తన పేరును అనన్య నాగళ్ల అని చదవగానే..'ప్రపంచం అంత వెతికా అంత కంటే గొప్ప పేరు' కనిపించలేదు అని సుధీర్ చెప్పాడం భలే ఆకట్టుకుంటోంది.'మీలో ఒక్కరికీ కూడా అన్యాయం చేయలేదు అంటూ సుధీర్ చెప్పగా..వెంటనే హీరోయిన్ శివాని రియాక్ట్ అవుతూ..'ఒకేసారి మా నలుగురిని మోసం చేశావంటూ' రివర్స్ పంచ్ ఇచ్చేసింది.
ఇలా మిగతా హీరోయిన్స్ ని కూడా తనదైన మాటలతో..పొగడ్తలతో షో అదరగొట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందమైన భామలు! మెరుపు తీగలు.మే 3న చూసుకోండి మల్లా, ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు.
ఈ సర్కార్ షో 2021లో మొదలైంది.కాగా గత సీజన్లో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి,సిద్దు జొన్నలగడ్డ,రానా,విశ్వక్ సేన్,శ్రీ విష్ణు,ప్రియమణి, సైనా నెహ్వాల్, కశ్యప్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ షో కి వచ్చి అదరగొట్టారు.