Shobha shetty: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ స్టార్స్

Shobha shetty: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ స్టార్స్

శోభా శెట్టి(Shobha shetty) అంటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ, కార్తీక దీపం సీరియల్ లో మోనిత అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కన్నడ బ్యూటీ శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ తో వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బిన్ సీజన్ 7లో అడుగుపెట్టింది శోభా. అంతేకాదు అబ్బయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఆది టాప్ 5లో కూడా చోటుదక్కించుకుంది. కానీ, విన్నర్ కాలేకపోయింది. అంతేకాదు.. తన నోటి దురుసు కారణంగా బయట తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. అదే విషయాన్ని చాలా మంది చెప్పినా వినకుండా.. తాను అంతే అని తెగేసి చెప్పేసింది శుభా.     

ఇదిలా ఉంటే.. తాజాగా శోభా తన సొంతింటి కాలనీ నెరవేర్చుకుంది. కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసింది. తనకు కాబోయే భర్త, కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శోభా. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ స్టార్స్ ప్రియాంక జైన్, టేస్టీ తేజ, ఆట సందీప్, శుభ శ్రీ తదితరులు హాజరయ్యారు. శోభా శెట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.