
బీజేపీ కేసులకు భయపడేది లేదన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్. రాహుల్ గాంధీ, రేవంత్ వాస్తవాలు మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లపై మాట్లాడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా1990 మండలి కమిషన్ కు వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ను తీసుకొచ్చిందన్నారు అనిల్. మండల్ కమిషన్ ఉండొద్దని కుట్ర చేసి.. అప్పటి కేంద్ర సర్కార్ ను పడగొట్టిందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ అంటే..బీహార్ బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తగనే మాట్లడలేదని.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కామెంట్స్ చేశారన్నారు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎంపికలో ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు అనిల్.ఈడబ్ల్యూసీ కోటాలోనే ఎక్కువగా సీట్లు పోతున్నాయని చెప్పారు.దేశాన్ని పాలించే ఐఏఎస్ లలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని చెప్పారు. దేశాన్ని పాలించే ఐఏఎస్ లలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారన్నారు. 95 శాతం సెక్రటరీలు ఉన్నత కులాల వరు కీలక నిర్ణయాలు తీసుకంటున్నారని తెలిపారు.యూపీఎస్సీలో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.