పరీక్ష రాయడానికి వెళ్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని మృతి

పరీక్ష రాయడానికి వెళ్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్టు పరిధిలోని బాటసింగారం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, స్కూటీ ఢీకొనడంతో.. స్కూటీపై ఉన్న విద్యార్థిని లారీ కింద పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 గాయపడ్డవారిని చికిత్స కోసం హాస్పిటల్‎కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న విద్యార్థినిగా గుర్తించారు పోలీసులు. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు.