హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు కింద పడి యువతి మరణించింది. వివరాల ప్రకారం.. లిఖిత (27) అనే యువతి మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం స్కూటీపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ జారి పక్క నుంచి వెళ్తోన్న స్కూల్ బస్సు కిందపడింది.
తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే లిఖిత మృతి చెందింది. పటాన్‌చెరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
