Prabhas Riddhi: ప్రభాస్–రిద్ధి శారీ స్టోరీ.. గాసిప్ కాదు, అసలు నిజం ఇదే!

Prabhas Riddhi: ప్రభాస్–రిద్ధి శారీ స్టోరీ.. గాసిప్ కాదు, అసలు నిజం ఇదే!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్- హీరోయిన్ రిద్ధి కుమార్ల మధ్య నడుస్తున్న పుకార్లకు చెక్ పడింది. ది రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిద్ధి కుమార్ వేదికపై మాట్లాడుతూ, ప్రభాస్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించింది. అలాగే, తాను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చారని రిద్ధి కుమార్ చెప్పడంతో.. ఒక్కసారిగా ఈలలు, చప్పట్లు మార్మోగాయి. మూడేళ్ల క్రితం ఈ తెల్ల చీరని ప్రభాస్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని, అది ఇన్నాళ్లకు కట్టుకున్నానని రిద్ధి చెప్పింది. అంతేకాకుండా ఆ చీరతో దిగిన ఫొటోలని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచిలర్ అయిన ప్రభాస్ గురించి ఇంత చెప్పాక, డార్లింగ్ ఫ్యాన్స్, సోషల్ మీడియా నెటిజన్లు ఊరుకుంటారా? అస్సలు ఉరుకోరు కదా.. అదే జరిగింది. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ట్వీట్స్, లైక్స్, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ప్రభాస్ ఆమెతో డేటింగ్ చేస్తున్నాడా అని అభిమానులు డిస్కస్ చేసుకోవడం షురూ చేశారు. ఇపుడు ఈ విషయం సోషల్ మీడియాలోవైరల్గా మారి రకరకాల పుకార్లకు దారీతీసింది.

అయితే, షూటింగ్ సమయంలో తన సహనటులందరికీ భోజనాలు పెట్టే ప్రభాస్.. చీరలు కూడా ఇస్తున్నారా..? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అలాగే, ఒక ఎక్స్ యూజర్, “ప్రభాస్.. నటి రిద్ధికుమార్‌తో డేటింగ్ చేస్తున్నాడా?” అని రాశారు. మరొకరు, “పాపం సీక్రెట్గా ఇస్తే.. లీక్ చేసింది” ఇంకొకరు “ఏదో అనుమానంగా ఉంది” అని భిన్నరకాల కామెంట్స్ పెడుతున్నారు.  

ఈ క్రమంలోనే చీర స్టోరీపై రిద్ధి కుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూరూమర్స్కి చెక్ పెట్టింది. “ దీపావళి తర్వాత రాజా సాబ్ సెట్స్ లో ఫస్ట్ టైమ్ అడుగుపెట్టా. అది అక్టోబర్ 23. ఆ రోజు ప్రభాస్ గారి బర్త్ డే. ఈ సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన దీపావళి గిఫ్ట్ అని, ఇందులో ఇంకేమీ అర్థం చేసుకోకూడదని” అన్నారు. అలాగే, సెట్స్కు వెళ్లాక.. నేను బుక్ను గిఫ్ట్గా తీసుకెళ్లా. అది కర్ణుడు స్టోరీ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన మృత్యుంజయ్ బుక్" అని రిద్ధి వెల్లడించింది.

అయితే, నేను ఇచ్చిన పుస్తకంలోని క్యారెక్టర్ కర్ణ, అదే సమయంలో ప్రభాస్ నటించి కల్కి సినిమాలో అతని క్యారెక్టర్ కల్కి అవ్వడంతో.. ప్రభాస్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారని రిద్ధి చెప్పుకొచ్చింది. అయితే, ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్​’లో ఆర్చర్​ ప్లేయర్​గా కనిపించి రిద్ది ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రభాస్కి జోడీగా హారర్​ కామెడీ ఫిల్మ్ రాజాసాబ్ లో నటించింది. ఈ హారర్​ కామెడీ ఫిల్మ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.