అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం (డిసెంబర్ 29) ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు.
ఇకపై ఏపీలో ప్రకృతి వైద్య విధానాల ప్రోత్సాహం, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి ఆయన సలహాలు అందించనున్నారు. డాక్టర్ మంతెన సత్యనారాయణతో పాటు మాస్ కమ్యూనికేషన్‌కు కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావు, ఎండోమెంట్స్‌కు చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌లు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు.
