నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం రాయిపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం అందించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగూర్ బ్యాక్ వాటర్ నిల్వ చేయడానికి రాయిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలో నిధులు మంజూరుకి కృషి చేస్తానని చెప్పారన్నారు.
