కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల... కీలక హామీలివే..

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. గతంలో ప్రకటించిన సూపర్ 6హామీలకు తోడు పలు కీలక హామీలను జతచేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది కూటమి. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తామని, సంపద సృష్టించి పథకాలకు నిధులు సమకూరుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు.

మేనిఫెస్టోలో కీలక హామీలు:

వృద్ధాప్య పెన్షన్ రూ.4000

దివ్యాంగుల పెన్షన్ రూ.6000

మెగా డీఎస్సీపై తొలి సంతకం 

ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్

మహళలకు ఉచిత బస్సు

యువతకు 20లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి

తల్లికి వందనం కింద  ప్రతి స్కూలు విద్యార్థికి 15వేలు

ప్రతి మహిళకు నెలకు 1500
 
3 ఉచిత సిలిండర్లు

ఉచిత ఇసుక

అన్నా క్యాంటీన్ల ప్రారంభం 

భూహక్కు చట్టం రద్దు

పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం 

చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 10శాతం సబ్సిడీ 

రాజధానిగా అమరావతి కొనసాగింపు

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్

వాలంటీర్లకు 10వేలు గౌరవ వేతనం.

బీసీ డిక్లరేషన్:

50ఏళ్లకే నెలకు 4వేల రూపాయలు పెన్షన్

5ఏళ్లలో లక్ష 50వేల కోట్లతో ఉపాధి పరంగా సహకారం

చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్

కులాల దామాషా ప్రకారం కార్పొరేషన్లు

స్వయం ఉపాధికి ప్రతి ఏటా 10వేల క్లొట్లు

ఆదరణ కింద 5వేల కోట్లతో ఆధునిక పనిముట్ల పంపిణీ

పాడి పరిశ్రమకు ఇన్సూరెన్స్, రుణాలు.

గొర్రెల పెంపకానికి సహకారం

పవర్ లూమ్స్ కి 500యూనిట్లు

హ్యాండ్ లూమ్స్ కి 200 యూనిట్ల కరెంట్ ఉచితం

చేనేతలకు ఏడాదికి 25వేలు

నాయి బ్రాహ్మణుల షాపులకు 200యూనిట్లు ఉచితం 

గౌరవ వేతనం 25వేలు 

గీత కార్మికులకు వైన్ షాపుల్లో 10శాతం రాయితీ

దోబీ ఘాట్లకు 200యూనిట్ల కరెంట్ ఉచితం

మత్స్యకారులకు విరామ సమయంలో 20వేల ఆర్థిక సాయం

స్వర్ణకారుల కోసం కార్పొరేషన్

డ్వాక్రా సంఘాలకు 10లక్షల వడ్డీ లేని రుణం.

విదేశీ విద్య పథకం 

పెళ్లి కానుక లక్ష రూపాయలు

పండుగ కానుకలు. 

మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి

చదువు మానేసిన అమ్మాయిలకు వడ్డీలేని రుణాలు

పీఆర్సీ విడుదల

సీపీఎస్ కు పరిష్కారం