భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు.. UPI చెల్లింపులపై ఎంవోయూ.. త్వరలోనే ట్రేడ్ డీల్.. 

భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు.. UPI చెల్లింపులపై ఎంవోయూ.. త్వరలోనే ట్రేడ్ డీల్.. 

పీఎం మోడీ ఇజ్రాయెల్ టూర్ ముగిసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలకు ఈ టూర్ వేదికయ్యింది.ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో కీలక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. UPI చెల్లింపులు, AI, సైబర్ భద్రత, రక్షణ, అంతరిక్ష, జల నిర్వహణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రకటించారు. గురువారం ( ఫిబ్రవరి 26 ) జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కీలక చర్చల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త మీడియా సమావేశంలో ప్రసంగించారు.

ఈ క్రమంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక MOUలు కుదిరినట్లు ప్రకటించారు. AI, UPI వంటి కీలక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. అంతే కాకుండా 27 రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. AI రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో పాటు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసేందుకు భారత్-ఇజ్రాయెల్ ఎకనమిక్ ఫోరమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలకనున్నాయని పేర్కొన్నారు అధికారులు.

అణు ఇంధన రంగంలో కూడా పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇరుదేశాల మధ్య 100 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు ఏర్పాటుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు. వ్యవసాయం నుంచి ఏఐ వరకు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్ సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు ప్రధాని మోడీ. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు మోడీ.