పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకో

పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకో

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జేబులు కట్ చేసి, నిజామాబాద్ ఎంపీ బ్లేడ్ బాబ్జీగా మారాడని, అందుకే బ్లేడుతో గొంతు కోసుకుంటా అంటున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఎంపీ అరవింద్ గొంతు కోస్తారని, ఆయనకు అంత ఆవేశం పనికి రాదన్నారు. బ్లేడ్ సిద్ధాంతం తమ పార్టీ టీఆర్ఎస్ కు బాగా కలిసి వస్తుందని, మళ్లీ అధికారంలోకి టీఆర్ఎస్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఎల్లమ్మ తల్లిపై తప్పుగా మాట్లాడిన ఎంపీ అరవింద్ తన ముక్కును నేలకు రాయాలని, లేకపోతే.. 2023లో జరిగే ఎన్నికల్లో ఎల్లమ్మ తల్లే రాజకీయ బలి తీసుకుంటుందని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకోవాలంటూ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక టూరిస్ట్ మినిస్టర్ అంటూ సెటైర్ వేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత గురించి అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ది చెబుతారంటూ హెచ్చరించారు. టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా నిర్వహించుకుంటామని చెప్పారు. గతంలో లేనంతగా 60 లక్షల మంది కార్యకర్తలు టీఆర్ ఎస్ వెంట ఉన్నారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

 

ఉద్యోగాల నోటిఫికేషన్ పై మాణికం ఠాగూర్ ట్వీట్

అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

గల్లీగల్లీకో మున్నాభాయ్ MBBS

విదేశీ గల్లీల్లో మన చాట్​.. మన బజ్జీ