V6 News

నేడు  (మే 1)  కొత్త డీజీపీగా సీవీ ఆనంద్  చార్జ్ 

నేడు  (మే 1)  కొత్త డీజీపీగా సీవీ ఆనంద్  చార్జ్ 
  • 11.05 గంటలకు బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్ర నూతన డీజీపీగా 1991 బ్యాచ్   ఐపీఎస్   అధికారి సీవీ ఆనంద్   శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్  లక్డీకపూల్ లోని పోలీస్   కేంద్ర కార్యాలయంలో ఉదయం 11.05 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణ స్థానికుడు, రాష్ట్ర  పోలీస్  కేడర్ కు చెందిన ఐపీఎస్  అధికారి  సీవీ ఆనంద్   తన కెరీర్  తొలినాళ్లలో పలు జిల్లాల్లో ఎస్పీగా విజయవాడ, సైబరాబాద్ , హైదరాబాద్   వంటి కీలక పోలీస్   కమిషనరేట్లకు కమిషనర్‌‌‌‌గా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌‌‌‌గా, ఏసీబీ డీజీగా, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పనిచేసిన ‍ప్రతి చోటా తనదైన ముద్రవేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన పోలీసింగ్   నిర్వహిస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.