కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గాంధీ కుటుంబం కారణం కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో జరిగిన నష్టానికి గాంధీ కుటుంబమే బాధ్యత వహించలేమన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు సోనియా గాంధీకి ఇదే విషయం చెప్పారని ఖర్గే చెప్పారు.  రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల్లో ఓటమికి సోనియా ఒక్కరే బాధ్యత వహించారన్నారు.  కానీ ఈ ఓటమికి ప్రతి రాష్ట్ర నాయకుడు, ఎంపీ బాధ్యత వహించాలన్నారు. 

"మేం ఆమెపై విశ్వాసం ఉంచాం, రాజీనామా చేసే ప్రశ్నే లేదు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఓటమికి గాంధీ కుటుంబం లేదా సోనియా గాంధీ మాత్రమే కాదు, మనమందరం బాధ్యత వహిస్తాము," అన్నారాయన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తమకు విశ్వాసం ఉందన్నారు. సోనియా గాంధీయే మా నాయకురాలు.. మా అందరికీ ఆమెపై విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ఎలా పని చేయాలి ? అనేది మా వ్యూహంగా ఉండాలన్నారు. అంతేకానీ రాజీనామా చేసే ప్రశ్నే లేదన్నారు. 50 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. సిడబ్ల్యుసి సభ్యులు, ఐదు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల జనరల్ సెక్రటరీలు, పరిశీలకులతో సమావేశం 4 నుండి 5 గంటల పాటు కొనసాగిందన్నారు. ప్రస్తుతమన్న పరిస్థితులపై చర్చించానమ్నారు. సోనియా నాయక్వతంలో.. బీజేపీపై... ఆ పార్టీ భావజాలంపై వ్యతిరేకంగా పోరాడతామన్నారు.