
బషీర్బాగ్, వెలుగు: స్టాండర్డ్చార్టెడ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. బోరాబండ ప్రాంతానికి చెందిన వ్యక్తి మొబైల్ నంబర్ ను ‘84 స్టాండర్డ్ చార్టెడ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్’ గ్రూప్ లో యాడ్ చేశారు.
800 శాతం రాబడి వస్తుందని రోజువారీ లాభాలంటూ నకిలీ స్టాండర్డ్చార్టెడ్ బ్యాంక్ లింకులు, ఇతరులకు లాభాలు వచ్చినట్లు స్క్రీన్ షాట్స్ షేర్చేశారు. అలాగే నకిలీ సెబీ సర్టిఫికెట్ పంపించారు. బాధితుడు నిజమని నమ్మి పలు దఫాలుగా మొత్తం రూ.7,60,000 లను ఇన్వెస్ట్ చేశాడు.
స్కామర్స్ క్రియేట్ చేసిన నకిలీ ట్రేడింగ్ వెబ్ సైట్ లో లాభాలు రూ.45 లక్షలుగా చూపారు. కానీ వాటిని విత్ డ్రా చేయాలంటే రూ.9 లక్షలు డిపాజిట్ తోపాటు 25 శాతం కమీషన్ చెల్లించాలని ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో అతని యాక్సెస్ ను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.