జోరుగా IPL బెట్టింగ్స్... ఫేక్ ప్రెడిక్షన్స్ తో మోసం... ఇన్స్టాగ్రామ్ పేజీలపై కేసు...

జోరుగా IPL బెట్టింగ్స్... ఫేక్ ప్రెడిక్షన్స్ తో మోసం... ఇన్స్టాగ్రామ్ పేజీలపై కేసు...

ఐపీఎల్ హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రోఫీ కోసం ఐపీఎల్ టీమ్స్ ఒక లెవెల్లో పోటీ పడుతుంటే...ఇన్స్టా పేజీల బెట్టింగ్ దందా మరో లెవెల్లో ఉంది. ఇంస్టాగ్రామ్ పేజీల ద్వారా బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ భారీగా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. ఈ క్రమంలో సైబర్ పెట్రోలింగ్ ద్వారా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పేజీలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్ లో భాగంగా కొన్ని లింకులను గుర్తించామని తెలిపారు పోలీసులు.

ప్రాఫిట్ వచ్చినట్టు ఫేక్ స్క్రీన్ షాట్ లు పెట్టీ ప్రజలను మోసం చేస్తున్నట్టు గుర్తించామని... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లో 2 FIR లు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఫేక్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను బెట్టింగ్ వైపు మభ్యపెడుతున్నారని తెలిపారు.

సైబర్ పెట్రోలింగ్ లో 18 లింక్ లు IPL బెట్టింగ్ లను ప్రోత్సహిస్తూ పోస్ట్ లు చేసినట్టు గుర్తించామని తెలిపారు.హిందీ యూజర్లు, తెలుగు యూజర్ల కోసం సెపరేట్ పోస్ట్ లు క్రియేట్ చేసి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 

బెట్టింగ్ కి దూరంగా ఉండాలని... ఈజీ మనీ కోసం ఆశపడి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి యాప్స్ పై cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.