
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో ప్రధాన నిందితుడైన ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఇవాళ విచారించనున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షపార్టీల నాయకుల్ని కించపరిచేలా పోస్టులు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి సునీల్ను సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నించనున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు ఇటీవలే దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో సునీల్ విదేశాల్లో ఉన్నారు. దీంతో భారత్కు తిరిగి వచ్చిన అనంతరం పోలీసులు ఆయనకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు.