మేడిపల్లి వెలుగు: సైబర్ నేరగాళ్లు మిత్రుల ముసుగులో సామాన్యులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా మేడిపల్లికి చెందిన అలోక్ గుప్తా(55)కు తన మిత్రుడు జ్ఞానేందర్ మిట్టల్ పేరుతో వాట్సాప్ నంబర్ నుంచి ఈనెల 19న అత్యవసరంగా నగదు కావాలంటూ సందేశం వచ్చింది. ఆపదలో ఉన్నాడనే నమ్మకంతో బాధితుడు కేటుగాడు పంపిన క్యూఆర్ కోడ్‌కు రూ. 48,000 బదిలీ చేశారు. తీరా మిత్రుడిని విచారించగా, తన వాట్సాప్ ఖాతా హ్యాక్ అయిందని తెలియడంతో బాధితుడు విస్తుపోయారు. బాధితుడు ఫిర్యాదుతో ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు
దర్యాప్తు చేస్తున్నారు.

