
- రూ.5 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
నిజామాబాద్: సైబర్ మోసగాల్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. తాము బ్యాంకు అధికారులమంటూ మీ బ్యాంకు ఖాతాకు పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉందని అన్నారు. మీరు బ్యాంకుకు రానవసరం లేదంటూ.. పాన్ కార్డు వివరాలు చెప్పంటూ నమ్మించారు. వారు అడిగిన వివరాలు చెప్పిన వ్యక్తి ఖాతాలోని ఐదు లక్షలు కాజేశారు. ఫోన్ కాల్ తర్వాత అకౌంట్లోని డబ్బు 5 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.