సైబర్ మోసాలపై అవగాహన తప్పనిసరి : సీడాక్ సీనియర్ డైరెక్టర్ సీహెచ్ఏఎస్ మూర్తి

సైబర్ మోసాలపై అవగాహన తప్పనిసరి : సీడాక్ సీనియర్ డైరెక్టర్ సీహెచ్ఏఎస్ మూర్తి
  • సైబర్ మోసాలపై అవగాహన తప్పనిసరి 
  • సీడాక్ సీనియర్ డైరెక్టర్ సీహెచ్ఏఎస్ మూర్తి

హైదరాబాద్, వెలుగు : స్టూడెంట్లకు సైబర్ హైజీన్ నేర్పించడం అత్యవసరమని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్, సీడాక్ సీనియర్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్​నెస్ కో ఆర్డినేటర్ సీహెచ్ఏఎస్ మూర్తి తెలిపారు. శనివారం అమీన్​పూర్​లో జరిగిన ఇంజీనియం వరల్డ్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం డిజిటల్ విధానంలో బోధన అవసరమే అయినప్పటికీ అది సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అడిక్ట్ అయ్యేలా ఉండకూడదన్నారు.

ఒకటి, రెండో తరగతుల పిల్లలు సోషల్ మీడియా యాప్స్ కు అలవాటు పడుతున్నారని.. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు. ఇలా నియంత్రించడాన్నే సైబర్ హైజీన్ అంటారని ఆయన చెప్పారు. అమీన్​పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఇంజీనియర్ ఎడ్యుటెక్ ప్రైవేటు లిమిటెడ్ సీఎండీ సుధాన్షు కుమార్,  డైరెక్టర్లు రచన, తృప్తి, భారతి తదితరులు పాల్గొన్నారు.