రూ. 3 కోట్లు..1228 కిలో గంజాయి.. ఛేజింగ్ చేసి పట్టుకున్నరు

రూ. 3 కోట్లు..1228 కిలో గంజాయి.. ఛేజింగ్ చేసి పట్టుకున్నరు

సైబారాబాద్ పోలీసులు మరో గంజాయి రాకెట్ ముఠాల గుట్టు రట్టు చేశారు. గంజాయి రవాణా చేస్తుండగా..నిందితులను పట్టుకున్నారు. మహారాష్ట్ర, హర్యానాకు చెందిన గంజాయి గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు. రెండు ముఠాల దగ్గర నుంచి రూ. 3 కోట్లకు పైగా విలువైన 1228 కిలోల గంజాయి, ఒక పిస్టల్, మూడు వెహికిల్స్ స్వాధీనం చేసుకున్నాన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని అరకు నుంచి తెలంగాణ మీదుగా షోలాపూర్, ఔరంగాబాద్ కు  నిందితులు గంజాయి రవాణా చేస్తున్నారు. రెండు కార్లలో  గంజాయిని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఓ ముఠా డీసీఎంలో గంజాయిని తరలిస్తుండగా ఛేజ్ చేసి పట్టుకున్నట్లు చెప్పారు.   ఈ రెండు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపై గతంలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరోవైపు డ్రగ్స్ కేసులో రాయదుర్గం ఎస్సై రాజేందర్కు ఎవరెవరితో సంబంధాలున్నాయో దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కానిస్టేబుల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఎస్సై రాజేందర్ను సస్పెండ్ చేశామని చెప్పారు.