
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశామన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సాయిధరమ్ తేజ్ కోలుకున్న తర్వాత నోటీసులు ఇచ్చామన్నారు. 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశామన్నారు. లైసెన్స్, బైక్ ఆర్ సీ, ఇన్సూరెన్స్ ,పొల్యూషన్ డాక్యుమెంట్లు అన్ని వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. సాయిధరమ్ తేజ్ నోటీసులకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదని... త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం: