ఘనంగా సైబరాబాద్ డ్యూటీ మీట్

ఘనంగా సైబరాబాద్ డ్యూటీ మీట్

గచ్చిబౌలి, వెలుగు: పోలీసుల పని ఒత్తిడిని తగ్గించి, శారీరక దృఢత్వం, ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు. గచ్చిబౌలి కమిషనరేట్ గ్రౌండ్​లో  సైబరాబాద్ పోలీస్ వార్షిక క్రీడలు, డ్యూటీ మీట్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాలు అధికారుల మధ్య పరస్పర అవగాహన, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, విధి నిర్వహణలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులకు దారి తీస్తాయన్నారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.